బతుకమ్మ: బిచ్కుంద : క్రియాశీల సభ్యత్వం ఉండాలంటే 100 మెంబర్షిప్ చేయాలని బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు కుమారి అరుణాతర తెలిపారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 42 బూత్ లలో క్రియాశీలక సభ్యత్వం జరగాలని, ప్రతి ఒక్కరికి క్రియాశీల సభ్యత్వం ఉండాలంటే 100 మెంబర్షిప్ చేయాలని తెలిపారు. మహిళలైతే 25 మెంబర్షిప్ చేయాలని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఈ క్రియాశీలక సభ్యులే పోటీ చేయడానికి అర్హులని, పార్టీ బాధ్యతలకు కూడా వారే అర్హులని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ రామ్ సెట్, బీజేవైఎం జిల్లా సెక్రెటరీ చెట్పల్లి విష్ణు, బిచ్కుంద మండల అధ్యక్షులు మల్లికార్జున దేశాయ్, బిచ్కుంద మండలం జనరల్ సెక్రెటరీ జాదవ్ పండరి, బీజేవైఎం మండల అధ్యక్షులు బుడాల గంగారాజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లు దేశయ్ ,చిన్న దేవాడ గణపతి, నవీన్ రెడ్డి, ధనుర్ విఠల్ , జ్ఞానేశ్వర్,తదితరులు పాల్గొన్నారు.
