– టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు ఎన్. సుమన్ కుమార్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టీఎన్జీవో సభ్యత్వo ప్రతీ ఉద్యోగి విధిగా తీసుకోవాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు ఎన్. సుమన్ కుమార్ అన్నారు. టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేని ఆదేశానుసారం…. టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. విద్య శాఖ, ట్రెజరీ శాఖ, రెవెన్యూ శాఖల తో పాటు వివిధ శాఖలలో ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసిన టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని,టిఎన్జీవో ప్రాథమిక సభ్యత్వం కు గల ప్రాముఖ్యతను వివరించి, ప్రతి ఉద్యోగి టిఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని విధిగా రశీదును పొందాలని టిఎన్జీవో నూతన జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ సూచించారు. అనంతరం టీఎన్జీవో నూతన జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా వివిధ శాఖల పక్షాన ఎన్ సుమన్ కుమార్ కు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, సహధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, కోశాధికారి దినేష్ బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్ జాకీర్ హుస్సేన్ ఉమా కిరణ్ గురు చరణ్ తదితరులు మరియు అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

