24.7 C
Hyderabad
Monday, August 3, 2026

కన్నుల పండువగా శ్రీ వారి కళ్యాణం

Must read

📰 Generate e-Paper Clip

  • రమణీయం, కమనీయం శ్రీవారి కళ్యాణం
  • జగత్ కళ్యాణానికే జగన్నాథుని కళ్యాణం
  • అశేషంగా తరలిన భక్తజన సందోహం

భీమ్ గల్, బతుకమ్మ : నింబచల లక్ష్మి నృసింహా స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్తీక శుద్ధ దశమి సోమవారం రోజున నంభి వంశ అర్చకులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీమాన్నింబచల లక్ష్మీనృసింహుని కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. జగత్ కళ్యాణం కోసం యేటా అర్చకులు కార్తీక మాసంలో నిర్వహించేఈ క్రతువు ఈ యేటా రమనీయం, కమనీయంగా నిర్వహించారు. వేలాదిగా భక్తులు స్వామి వారి, అమ్మ వారి కళ్యాణం ను తిలకించేందుకు రాగా అర్చకులు శ్రీవారి క్రతువు లో విధానాలను విన సొంపుగా వివరిస్తూ కళ్యాణం క్రతువును కమనీయము గా నిర్వహించారు. ఈ స్వామి వారి కళ్యాణ ఘట్టంలో భాగంగా ఉదయం గర్భలయం లో ప్రధాన అర్చకులచే నిర్వహింపజేశారు. మధ్యాహ్నం తిరిగి ఎదురుకొలు జరిపి మంటపం లో విడిగా ఉంచిన అశ్వవాహనుడైనా స్వామి చెంతకు పల్లకిలో అమ్మవారిని చేర్చి అర్చకులు అనూహవం యుంజనా ప్రథమం అను శాకునాది మంత్రములను ఉచ్చరించుచు కల్యాణ ఘట్టంలోని మొదటిదైనా కలషా పూజ నిర్వహించి లక్ష్మి, నృసింహులకు రక్ష బంధనం గావించారు. ఇట్టి వివాహంనకు మంత్ర సంస్కారామోనార్చి స్వామి వారికి యజ్ఞఉపవిత ధారణ గావించారు. స్వామి వారి పాద చిహ్నంలు ఆగు శఠగోపంనకు ప్రతవిష్ణు అనే మంత్రంచే పాద్దప్రక్షళన గావించి ఇమాంమే గంగతే అనే మంత్రంచే స్నానం ఓనరీంపజేశారు.

Sri Vari Kalyanam is a feast for the eyes

అనంతరం స్వామి వారి, అమ్మవారి గోత్ర ప్రవరులను ఉచ్చరించి పెరుగు, తేనెను కలిపినా మధుపర్కంను వేద మంత్రములచే శ్రీవారికి త్రాగించి కన్యధాన సంకల్పంను అర్చకులు చేశారు.తదనంతరం శ్రీస్వామి వారి దోసిళ్లలో అమ్మ వారి దోసిలిని ఉంచి అర్చకులు తమ మను భావనచే వారి వారి దోసిల్లలో కన్యాం కనక సంపన్నం అని మంత్రాలు పటిస్తూ సంతత దార జలంచే స్వామి వారికి అమ్మవారిని కన్యాధానం చేశారు. అనంతరం శ్రీనృసింహుని, లక్ష్మి అమ్మవారిని ఒకరినొకరు ఎదురేదురుగా స్వస్తిక్ చిహ్నం గల పెండ్లి పీఠలపై కూర్చోబెట్టి ఇద్దరి మధ్య వస్త్ర తెరను ఉంచి మంగళ వాయిద్యములు మ్రోగు చుండగా తదేవ లగ్నం తదేవా సుదినం తదేవా తరబలం విద్యా బలం తదేవా అను మంత్రాస్టాకంలు చదువుతూ దేవత లగ్న సాంప్రదాయంతో ముత్యాలతో కుడి తాళాంబ్రాలను శఠగోపం పై సమర్పించారు. తదుపరి అర్చకులు అఘోరా చక్షు మంత్రం పటించుచు స్వామి అమ్మవార్లను ఒకరినొకరు చూసుకొనేలా చేశారు. ధ్రువంతే రాజా వరునో అనే మంత్రంను చదువుతూ ప్రధాన అర్చకులు జీలకర్ర బెల్లం ను స్వామి వారి శఠగోపంపై సమర్పించారు. తర్వాత మాంగళ్య పూజ చేసి, ఆ దివ్య మంగళ్యమును భక్తులకు చూహించి సమస్త భక్తజనం మ్రోక్కుచుండగా, మంగళ వాయిద్యాల మ్రోగుచుండగా మాంగళ్యం తంతునానేనా అంటూ వేద మంత్రాలను పఠిస్తు స్వామి వారి తరపున అర్చకులు అమ్మవారి మేడలో మంగళ సూత్రధారణ గావించారు. తదుపరి అక్షంతలు స్వామి వారు అమ్మవారు ఒకరినొకరు దోసిల్లతో శీరస్సు పై పోసుకొనే క్రతువును అర్చకులు శఠగోపం పై పోస్తూ నిర్వహించారు. అనంతరం వధూవరులైన శ్రీవారి దంపతులకు బ్రహ్మముడిని వేసి మంగళహారతినిచ్చారు.అర్చకులు ఆశీర్వచన పనసనలను చదివి కల్యాణ క్రతువును వీక్షించిన స్వామి వారి వివాహనికి కట్నకానుకలు భక్తులు సమర్పించికొన్నారు.అనంతరం భక్తులకు అర్చకులు ప్రసాద అక్షింతలను అందజేసిన ఆశీర్వాదించారు. స్వామి వారి వివాహ అనంతరం రాత్రికి అర్చకులు స్థాలి పాక హోమం ను నిర్వహింపజేశారు.

Sri Vari Kalyanam is a feast for the eyes

More articles

Latest article