28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  : నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రుద్రూర్ మండలం బొప్పాపుర్ రోడ్డులో గల బోయి గల్లీలో ప్రజలకు రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు కళాబృందం వారి ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, మూఢ నమ్మకాలు, ట్రాఫిక్ అవేర్నెస్ పై నాటికను ప్రదర్శిస్తూ, పాటలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రుద్రూర్ ఎస్సై సాయన్న మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా మూఢనమ్మకాలను నమ్మవద్దని వివరించారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ ఎస్సై సాయన్న, పోలీసు కళాబృందం సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

 

More articles

Latest article