26.6 C
Hyderabad
Monday, August 3, 2026

జిల్లా బాల్ బ్యాడ్మింటన్ మహిళా జట్టుకు క్రీడా దుస్తుల వితరణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్: ఈనెల 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్స్ హనుమకొండ జిల్లాలో జరిగే 70వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళా,పురుషుల బాల్ బ్యాట్మెంటన్ క్రీడా పోటీలకు ఎంపికైన ఉమ్మడి నిజాంబాద్ జిల్లా జట్టుకు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మోర్తాడ్ లో శిక్షణ శిబిరానికి శుక్రవారం ముగింపు కార్యక్రమం నిర్వహించి క్రీడా దుస్తులను వితరణ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా శ్రీ విద్యా సాయి హై స్కూల్ కమ్మర్ పల్లీ కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి హాజరై తన వంతు సహకారంగా పురుషుల,మహిళ క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందజేయడం జరిగింది. క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ క్రీడాకోటను ఉపయోగించుకొని ఉన్నత స్థాయిలో నిలవాలని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నిజామా బాద్ బాల్ బ్యాడ్మింటన్ సంఘ ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, ఉపాధ్యాయులు రవి రాజ్, రవీందర్, అశోక్, మనోజ్ రెడ్డి, సాయిరాం, శకుంతల, పద్మ, అనిత తదితరులు పాల్గొన్నారు.

Distribution of Sportswear to District Ball Badminton Women Team

More articles

Latest article