28.8 C
Hyderabad
Monday, August 3, 2026

జాతీయస్థాయి కథ, కవిత పోటీల్లో ఏర్గట్ల విద్యార్థుల ప్రతిభ

Must read

📰 Generate e-Paper Clip

ఏర్గట్ల, బతుకమ్మ: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ సాహిత్య పరిషత్ జాతీయస్థాయిలో కథ,  కవితల పోటీలు నిర్వహించగా ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. తొమ్మిదో తరగతి విద్యార్థి అభిలాష్ రాసిన కథకు మొదటి బహుమతి రాగా, రిశ్వంత్ కి ప్రోత్సహక బహుమతి లభించింది. ఏడో తరగతి విద్యార్థి వేముల రూపక్ కి కవితా పోటీలో మొదటి బహుమతి లభించింది. ఈనెల 15వ తేదీన హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత సాహిత్య పరిషత్ లో నిర్వహించనున్న కార్యక్రమంలో తమ విద్యార్థులు బహుమతులు అందుకుంటారని తెలుగు ఉపాధ్యాయుడు ప్రవీణ్ శర్మ తెలిపారు. విద్యార్థులను హెచ్ఎం కృష్ణ చారి అభినందించారు. ఉపాధ్యాయులు మునీరొద్దీన్, ప్రసాద్,రాజశేఖర్, పవన్, విజయ్, శ్రీనివాస్, గంగాధర్, రాజ నర్సయ్య,రాజేందర్, సమిత, ఇందిర, నరేశ్, రాజగోపాల్, ట్వింకిల్ తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article