24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా సీఎం రేవంత్ జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  55వ జన్మదిన వేడుకలను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి  అధ్యక్షతన కాంగ్రెస్ భవన్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజా సేవలో ఉంటూ ప్రజల మధ్య తిరిగే నాయకుడని, జడ్పీటీసీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగారని, ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను, ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకువెళ్లి ఆయనకు అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ రమేశ్ రెడ్డి , గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, ఐ డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, జిల్లా  అధ్యక్షుడు వేణు రాజ్, రాష్ట్ర ఎన్ఎస్ యూ ఐ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, తంబాకు చంద్రకళ, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు వినయ్, స్టేట్ ఓబీసీ కో ఆర్డినేటర్ డి భాస్కర్, విజయారాణి  తదితరులు పాల్గొన్నారు.

Grand celebration of CM Revanth's birthday

 

More articles

Latest article