ఘనంగా సీఎం రేవంత్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ భవన్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజా సేవలో ఉంటూ ప్రజల మధ్య తిరిగే నాయకుడని, జడ్పీటీసీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగారని, ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రేవంత్ రెడ్డిని...