27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

డ్వాక్రా మహిళలను మోసం చేసిన బొప్పిడి అనుసూజ రెడ్డి పై చర్య తీసుకోవాలని పీడీకి వినతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలోని గాజులపేట్ ప్రాంతానికి చెందిన బొప్పిడి అనుసూజ రెడ్డి సిపిఎం పార్టీ మహిళా సంఘానికి చెందిన నాయకురాలిగా చలామణి అవుతూ 16 డ్వాక్రా గ్రూపులను, 200 మంది డ్వాక్రా మహిళలను మోసం చేసిన ఘటనపై విచారణ చేపట్టాలని నవయుగబాట సమైక్య ఆధ్వర్యంలో మెప్మా పీడీ రాజేందర్ కు వినతి పత్రం గురువారం అందజేశారు. ఈ సందర్భంగా సమైక్య అధ్యక్షురాలు అంతని విజయం మాట్లాడుతూ అమాయకులైన మహిళల పేరుతో బ్యాంకులో లోను తీసుకొని సగం డబ్బు వాళ్లకు ఇచ్చి సగం డబ్బు తన వద్ద ఉంచుకుందని తెలిపారు. తిరిగి మొత్తం డబ్బులు వడ్డీతో చెల్లించాలని అనేక మందిని మోసం చేస్తుందని అన్నారు. 16 స్వయం సహాయక సంఘాలను మెప్మా కు సంబంధం లేకుండా 10 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించారని అన్నారు. ఎదిరించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తానని బెదిరింపులకు గురిచేస్తూ వడ్డీ వ్యాపారాలను కొనసాగిస్తుందని తెలిపారు. లైసెన్సు లేకుండా చిట్టీలు నిర్వహిస్తూ చక్రవడ్డీలను వసూలు చేస్తుందని, మహిళలకు చెల్లించాల్సిన పొదుపు డబ్బులను కూడా తమ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకొని ఏ ఒక్కరికి డబ్బులు ఇవ్వలేదని అన్నారు. ఈ ఘటనపై సమగ్రమైన విచారణ చేపట్టి డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్న బొప్పిడి అనుసూజరెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, రమాబాయి, సవిత,  డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

More articles

Latest article