30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఈ నెల 15 నుండి బీజేపీ బూత్ కమిటీల ఎన్నికలు

Must read

📰 Generate e-Paper Clip

  • 100 సభ్యత్వాలు జరిగిన బూత్ లోనే ఎన్నికలు ఉంటాయి
  • మండలానికి 100 క్రియాశీల సభ్యత్వాలు తప్పనిసరి
  • కామారెడ్డి సంస్థాగత ఎన్నికల పర్యవేక్షణ అధికారి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
  • 50 సభ్యత్వాలు చేసిన మహిళలు క్రియాశీల సభ్యత్వానికి అర్హులు
  • అన్ని వర్గాల ప్రజలతో బీజేపీ సభ్యత్వం చేయించాలి
  • ముఖ్యంగా యువత, మహిళలను సభ్యత్వం చేయించాలి
  • పార్టీ పదవులు రావాలంటే క్రియాశీల సభ్యత్వం తప్పనిసరి
  • కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

కామారెడ్డి, బతుకమ్మ : ఈ నెల 15 నుండి బీజేపీ బూత్ కమిటీల ఎన్నికలు ఉంటాయనికామారెడ్డి సంస్థాగత ఎన్నికల పర్యవేక్షణ అధికారి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. భారతీయ జనతా పార్టీ సంస్తాగత ఎన్నికల కార్యశాల బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు అరుణా తార అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి సంస్థాగత ఎన్నికల పర్యవేక్షణ అధికారి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ బీజేపీ దేశ వ్యాప్తంగా సంస్తగత మార్పుల్లో భాగంగా ఈ నెల 15 నుండి బీజేపీ బూత్ కమిటీల ఎన్నికలు నిర్వహించనున్నామని, 100 సభ్యత్వాలు జరిగిన బూత్ లోనే ఎన్నికలు ఉంటాయని అన్నారు.

BJP booth committee elections from 15th of this month

ఇంకా 100 సభ్యత్వం పూర్తి కానీ బూత్ లలో 100 సభ్యత్వాలు పూర్తి చేయాలని అన్నారు. మండలానికి 100 క్రియాశీల సభ్యత్వాలు తప్పనిసరి అని అన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ 50 సభ్యత్వాలు చేసిన మహిళలు క్రియాశీల సభ్యత్వానికి అర్హులు అని,  మహిళా కార్యకర్తలు 50 సభ్యత్వాలు పూర్తి చేసి క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల ప్రజలతో బీజేపీ సభ్యత్వం చేయించాలనీ ముఖ్యంగా యువత, మహిళలను సభ్యత్వం చేయించాలనీ గుర్తు చేశారు. రాబోయే కాలంలో పార్టీ పదవుల రావాలంటే క్రియాశీల సభ్యత్వం తప్పనిసరి అని నిబంధన ఉన్నదని కావున ప్రతి నాయకుడు 100 సభ్యత్వాలు పూర్తి చేసి క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలని అన్నారు.

BJP booth committee elections from 15th of this month

More articles

Latest article