27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

డీసీ కేసు ఉండే..   స్పౌజ్ ఎలా వచ్చే..

Must read

📰 Generate e-Paper Clip

  • పెండింగ్ లో ఉంది -ఫైనల్ కు రాలేదు 
  •  సిఎండి ఆదేశాలు తుంగలో…
  • ఫిర్యాదు చేసేందుకు ఉద్యోగుల సమాయత్తం 

నిజామాబాద్, బతుకమ్మ :  బదిలీల ప్రక్రియ మొదలైందంటే చాలు, ఉన్న దగ్గరే ఉండేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సంఘపరంగా, రోగాలున్నాయని, స్పౌజ్  (జీవిత భాగస్వామి) అని చెప్పి బదిలీ లేకుండా చేసుకుంటున్నారు. ప్రాధాన్యత ప్రమాణాలు పాటించాలని, వాటిని తప్పితే కఠిన చర్యలు ఉంటాయని కంపెనీ సీఎండి ఆదేశాలు ఇచ్చారు. ఏళ్లుగా ఇక్కడే ఉన్నాం.. అవన్నీ మాకు చెల్లవు అంటూ ఒక అధికారి స్పౌజ్ ఉపయోగించుకొని నగరంలోనే ఉండిపోయారు. ఈ సారి ఎలాగైనా నగర పరిధి నుంచి దాటించాలని కంకణం కట్టుకున్న ఉద్యోగులు, సిఎండి ఇచ్చిన ప్రాధాన్యత ప్రమాణాలను ముందు ఉంచుకున్నారు. ఆ అధికారిపై డిసి కేసు ఉందని తెలుసుకున్న పవర్ హౌస్ లోని కొందరు ఉద్యోగులు కంపెనీకి పిర్యాదు చేయనున్నారని తెలిసింది.

 డిసి కేసు ఉండే…

ఇటీవల చేపట్టిన బదిలీలలో భాగంగా ఉద్యోగులకు కొంత వెసులుబాటు కల్పించారు. ఇదే క్రమంలో ప్రాధాన్యత ప్రమాణాలలో మరో కఠిన అంశాన్ని చేర్చారు. సంస్థ పరంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న (డిసిప్లినరీ కేసు) ఉద్యోగికి  స్పౌజ్  వర్తింపజేయరాదని స్పష్టం చేశారు. దీనిని ఉల్లంఘించినట్లయితే తీవ్రమైన  చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కంపెనీ సిఎండి వరుణ్ రెడ్డి వెల్లడించారు. సంస్థలోని కేసులు గాకుండ బయట పోలీస్ స్టేషన్లో ఉన్న వాటిని పరిగణనలోకి  తీసుకోవాలని సర్కిల్ అధికారులు భావించారేమో ..ఫలితంగా అలాంటివి లేవని  ఆ అదికారికి  లోకల్ లోనే పోస్టింగ్ ఇచ్చారు.

   స్పౌజ్ ఎలా వచ్చే…..

సంస్థ పరంగా డి.సి. కేసును ఎదుర్కొంటున్న ఉద్యోగికి సిఎండి జారీ చేసిన ప్రమాణాల ప్రకారంగా స్పౌజ్ ఇవ్వరాదనే నిబంధన ఉంది. అయినా ఆ ఉద్యోగికి జీవిత భాగస్వామి ప్రామాణికాన్ని చేసుకొని ఇచ్చారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ, పవర్ హౌస్ లోని ఉద్యోగుల నోటి వెంట మెల్లిగా బయటపడింది. నగరంలోని ఒక విభాగంలో  పని చేసినప్పుడు అక్కడ జరిగిన అవినీతిపై డి.సి. కేసు నమోదైంది. ప్రస్తుతం ఉన్న ఎస్ఈ     తో జరిగిన వాగ్వాదంపై మరో డి.సి. కేసు నమోదు చేయబడింది. దీనిపై విచారణ జరుగుతోందేగాని, ముగింపు (ఫైనల్)నకు రాలేదు. ఇలాంటివి ఉన్నప్పుడు స్పౌజ్ ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ ఆ ఉద్యోగికి జీవిత భాగస్వామి కోటలో స్థానికం వర్తింపజేశారు.

తెలుసుకొనే ఇచ్చాం. ఎస్ఈ రవీందర్ 

డి. సి. కేసు ఉంటే దీనికి వర్తించదు. పోలీస్ స్టేషన్ లో కేసు (ఎఫ్ఐఆర్) ఉంటే స్పౌజ్ ఇవ్వరాదు. ఈ విషయాన్ని కంపెనీలోని సంబంధిత విభాగం వారిని అడిగి తెలుసుకొనే ఇచ్చాం.

More articles

Latest article