నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో పనిచేస్తున్న ఎం.ఎల్.హెచ్.పి లకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజా శ్రీ సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతా శిశు సేవలు, కీటక జనత వ్యాధులు, వ్యాధి నిరోధక టీకాలు, , అ సంక్ర మిత వ్యాధుల నియంత్రణ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో ఆరోగ్య సేవలు, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ సేవలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని మీటింగ్ హాల్లోసమీక్షించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ అంజన్న, కీటకజనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజు గౌడ్, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ వినీత్ రెడ్డి, వివిధ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో పని చేస్తున్న ఎంఎల్ హెచ్పి లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
