27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బిల్లులు అడుగకుండా సర్పంచ్ లను భయపెట్టాడానికి ముందస్తు అరెస్టులు

Must read

📰 Generate e-Paper Clip

సర్పంచ్ ల అరెస్టులను ఖండించిన మాజీ మంత్రి వేముల

 నిజామాబాద్, బతుకమ్మ:

గ్రామాలలో పనులు చేసి తమకు రావాల్సిన బిల్లుల కోసం  ప్రభుత్వంను అడగుతున్న సర్పంచ్ లను అరెస్టు చేయడం దారుణం అని  మాజీ మంత్రి, బాల్కోండ శాసన సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తన నియోజకవర్గంకు చెందిన సర్పంచ్ లను సోమవారం తెల్లవారు జామున అరెస్టు చేయడం పై  వేముల స్పందించారు. పది నెలల క్రితం పనులు చేసిన వారిని భయపెట్టడం కోసం అరెస్టు చేయడం దారుణం… పని చేసిన డబ్బులు ఇవ్వమంటే ప్రజా పాలనలో అరెస్టు విడ్డురం అన్నారు. చిన్న బిల్లులు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ధ పైసలు లేవు గాని పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిలకు కోట్లు ఇవ్వడానికి  ఎలా వచ్చాయి అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎర్పడిన తరువాత గ్రామాలలో చేసిన పనులకు డబ్బులు ఇవ్వమంటే కుదరదని చెబుతునే లక్షన్నర కోట్ల ప్రాజెక్టు మూసిలో కమిషన్ లు దోబ్బి తిందామని చూస్తున్నారు అని ఆరోపించారు. కేసిఆర్ హయంలో పల్లే ప్రగతిలో కేంద్రం ఇచ్చిన 15 కమిషన్ ఇచ్చిన డబ్బులు నేరుగా సర్పంచ్ ల ఖాతాలోకి వేసినాం. కేంద్ర నిధుల తో పాటు రాష్ర్ట ప్రభుత్వం నిధులు సరి సమానంగా విడుధల చేసినం అని గుర్తు చేశారు. పల్లేలలో పాలన పడకేసిందని, పారిశుద్యం పనులు జరుగడం లేదన్నారు. కేంద్రం ఇచ్చిన 15 కమీషన్ నిధులుకోట్ల రూపాయాలను దారి మళ్లించడంతో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. సర్పంచ్ లను వెంటనే విడుధల చేయాలి లేకపోతే వారి పక్షన అందోళన చేస్తామని హెచ్చారించారు.

 

More articles

Latest article