26.3 C
Hyderabad
Monday, August 3, 2026

 నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ లో మూహుర్తం కుదిరింది

Must read

📰 Generate e-Paper Clip

. . . క్రయ విక్రయాలు ప్రారంభించిన చైర్మెన్ ముప్ప గంగారెడ్డి

  నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ ( శ్రద్ధనంధ్ గంజ్ ) లో క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి. దీపావళి పండగ సంధర్బంగా మార్కేట్ లో మూహుర్తం ప్రకారం సోమవారం ఉదయం ఎఏంసీ చైర్మెన్ ముప్ప గంగారెడ్డి  వ్యాపార లావాదేవిలను ప్రారంభించారు.  అంతకు ముందు మర్చంట్ అసోసియేషన్ తో పాటు పాలకవర్గం అధ్వర్యంలో దిపావళి సమ్మేళనం జరిగింది. ఉదయం పూజ కార్యక్రమాలు నిర్వహించి కోనుగోళ్లు ప్రారంభించారు వ్యాపారులు. ఈ సంధర్బంగా నూతనంగా నియమితులైన మార్కేట్ కమీటి చైర్మెన్ ముప్ప గంగారెడ్డి ని మర్చంట్ అసోసియేషన్ భాధ్యులు సన్మానించి సత్కరించారు. ఈ సంధర్బంను పురస్కరించుకోని చైర్మెన్ మాట్లాడుతు… వ్యాపారవేత్తలు , మా రైతు సోదరులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామచందర్ ,  డైరెక్టర్లు మల్లేష్ , కౌడపు రఘువీర్, రాజలింగం లతో పాటు వ్యాపారులు, రైతులు పాల్గొనడం జరిగింది.

Nizamabad agricultural market trading start

 

More articles

Latest article