24 C
Hyderabad
Sunday, August 2, 2026

రేషన్ షాపును ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరుమండల కేంద్రంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నూతన రేషన్ షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలో ఇటీవల ఖాళీగా ఉన్న రేషన్ షాపుల కొరకు పరీక్షల ద్వారా ఎంపికైన నిరుద్యోగులను మెరిట్ పద్ధతి ప్రకారం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వారికి రేషన్ షాప్ లు కేటాయిస్తూ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్‌కు కేటాయించిన రేషన్ షాపును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు బియ్యాన్ని తూకం సరిగ్గా వెయ్యాలని , సమయపాలన పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి, ఎఎంసి చైర్మన్ రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, ఎమ్మార్వో శివ ప్రసాద్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article