జుక్కల్, బతుకమ్మ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్స్ పై సబ్సిడీ ఇవ్వాలని మంత్రిని కోరారు. వరి, సోయా కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని, సోయా ఎకరానికి 8 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుతో పాటు పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ ఉన్నారు. పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారానికి హాజరవ్వాలని మంత్రిని కోరారు.
