వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు 

జుక్కల్, బతుకమ్మ :   రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుక్రవారం కలిశారు.  ఈ సందర్భంగా రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్స్ పై సబ్సిడీ ఇవ్వాలని మంత్రిని కోరారు. వరి,  సోయా కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని,  సోయా ఎకరానికి 8 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుతో పాటు పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ ఉన్నారు. పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ...