వర్ని, బతుకమ్మ: రైస్ మిల్లులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం సాయంత్రం దాడి చేశారు. లింగారెడ్డి రైస్ మిల్లులో పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో ఇన్ చార్జి సీపీ సింధు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. 10మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని రూ.1,14,500 నగదు, 10 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన పేకాటరాయుళ్లను వర్ని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.
