24 C
Hyderabad
Sunday, August 2, 2026

పండగ పూట జోరుగా పేకాట

Must read

📰 Generate e-Paper Clip

. . . జోరుగా మూడు ముక్కలాట
. . . క్లబ్ లలో రమ్మి స్థానంలో త్రీ క్యాట్
. . . మళ్లీ పేకాటకు పూర్వ వైభవం
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో పండగ పూట పేకాట జోరందుకుంది. దీపావళి పండగకు వారం రోజుల ముందునుంచే మూడు ముక్కలాట జోరుగా సాగుతుంది. పల్లేలు మొదలుకుని, పట్టణాలలో, గ్రామాలతో మొదలు పెట్టి నగరం వరకు పత్తాలాటా ఊపందుకుంది. దీపావళి పండగ సంధర్బంగా పేకాట వారోత్సవాలు, మాసాలను ఇప్పటికే పేకాట రాయుళ్లు ప్రారంభించారు. అందర్ బహర్, త్రీక్యాట్, రమ్మి పేరిట జరుగుతున్న జూదంలో అత్యధికంగా మూడు ముక్కలాటనే జరుగడం గమనార్హం. పత్తాలాటకు రహస్య స్థావరాలు అక్కర్లేకుండా రిక్రియేషన్ క్లబ్ లలోను, సంఘాల, అసోసియేషన్ భవనాలు వేదికయ్యాయి. మూడు ముక్కలాటలో కోట్ల రుపాయాలు చేతులు మారుతున్నాయి.
దీపావళి కి పేకాట నిజామాబాద్ జిల్లాలో అనాధిగా అడటం ఆచారంగా సాగిస్తున్నారు. ఉత్తర భారతీయుల ద్వార వచ్చిన పేకాట కల్చర్ కు ఇప్పుడు పూర్వ వైభవం లభిస్తుంది. పండగ రోజు పేకాట ఆడటం ఉత్తర భారతీయుల ఆచారం. ఆనాడు డబ్బులు పోగోట్టుకున్న లేదా సంపాధించిన ఆ ఏడాది మొత్తం అలానే వ్యాపారం జరుగుతుందనే కల్చర్ గత దశాబ్ధాలుగా సాగుతోంది. ప్రత్యేక రాష్ర్టం ఏర్పడక ముందు బహిరంగంగా టెంట్ ల క్రింద పత్తాలాట జరిగేది. ఐతే గత దశాబ్ధకాలంగా ప్రధానంగా ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిన తరువాత పేకాటపై నిషేధం కోనసాగుతుంది. దానికి తోడు ప్రభుత్వం క్లబ్ లో పేకాటను నిషేధించారు. దానితో పేకాట ఆడటం గగనంగా మారింది. పోలీస్ శాఖ కుడా మూడు ముక్కలాటను ఉక్కుపాదంతో అణిచివేసింది. ప్రత్యేకంగా కమీషనర్ కన్నుసన్నులలో ఉండు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు జూదం అడ్డాలకు బ్రేక్ లు వేసింది. దానితో పేకాట రాయుళ్లు పోరుగున ఉన్న మహరాష్ర్ట లేదా గోవా అది కుదరదు అంటే గల్ఫ్ లేదా ఆసీయా దేశాలకు వెళ్లి పేకాట ఆడేస్థాయికి ఎదిగారు.
నిజామాబాద్ జిల్లాలో పండగ గడియలు రావడంతో పేకాట కోసం వలస వెళ్లిన పక్షులు గూటికి చేరుకుంటున్నాయి. నిజామాబాద్ కు పోలీస్ కమీషనర్ లేకపోవడం, టాస్క్ ఫోర్స్ లేకపోవడంతో మళ్లీ పేకాట ఆడుకునేందుకు అనువైన సమయం అని జూదగాళ్లు ఓకే గుటి పక్షులుగా చెంతకు చేరుకుంటున్నారు. గత వారం రోజులుగా వాట్సప్ లలో లోకేషన్ లను షేర్ చేసి పత్తాలాటా ఆడేవారిని రప్పిస్తున్నారు. పేకాట ఆడేవద్ధ సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పోలీస్ రైడింగ్ ఐతే తమేదే భాధ్యత అని ప్లంటర్ లను రప్పిస్తున్నారు. పత్తాలాట ఆడే ప్లేయర్ లను గోవా లేదా ఆసియా మైనర్ దేశాలకు తరలించుటకు ఆఫర్ లను ప్రకటించారు మరికొందరు. మొత్తానికి పండగ పూట పత్తాలాట జోరందుకుంది.

More articles

Latest article