27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రేపు ఆర్మూర్ లో బౌద్ధ దీపావళి 

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్,బతుకమ్మ : చీకటి అమావాస్య రోజు ప్రజలు దీపాలు వెలిగించి బుద్ధుడిని ఘన స్వాగతపర్చిన రోజే “బౌద్ధ దీపావళి” అంటూ ప్రపంచ బుద్ధిష్ట్ ప్రజలు ఉత్సవం జరుపుకుంటారని డాక్టర్ అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఇత్వార్ పేట్ లింగన్న, యశో బుద్ద ఫౌండేషన్ ప్రముఖులు పబ్బా శంకర్, బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్మూర్ మండల అధ్యక్షులు వికాస్ పవార్ తెల్పారు.  అట్టి దీపావళిని  గురువారం సాయంత్రం 5గంటలకు ఆర్మూర్ టౌన్ లోని హౌసింగ్ బోర్డులోగల బుద్ద పార్క్ వద్ద ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఉత్సవంలో ఆర్మూర్ చుట్టూ ప్రక్కల ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలందరు, ముఖ్యంగా మహిళలు, పిల్లలతో భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article