25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

చెరుకు పంటను పండిస్తే అధిక దిగుబడులు

Must read

📰 Generate e-Paper Clip

– బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

– రుద్రూర్ ఫుడ్ సైన్స్ కళాశాలను సందర్శించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

రుద్రూర్, బతుకమ్మ : రైతులు చెరుకు పంటలను పండిస్తే అధిక దిగుబడి పొందవచ్చని మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో గల ఫుడ్ సైన్స్ కళాశాలను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. ఫుడ్ సైన్స్ కళాశాలలో పండిస్తున్న చెరుకు పంటను ఆయన పరిశీలించారు. అనంతరం కళాశాల శాస్త్రవేత్తలతో పలు రకాల పంటల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. బాలాజీ నాయక్ చెరుకు, వరి పంటలలో రకాల గురించి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రోజెక్టర్ ద్వారా చూపిస్తూ వివరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు వరి పంటలతో పాటు చెరుకు పంటలను కూడా పండించాలని సూచించారు. చెరుకు పంటలను పండిస్తే అధిక దిగుబడి పొందవచ్చని అన్నారు. అదేవిధంగా వివిధ రకాల పంటల గురించి వ్యవసాయ శాస్రవేత్తలకు, రైతులకు పలు సలహాలు, సూచనలు తెలియజేశారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెంట తహేర్ బీన్ అందాన్, మానాల మోహన్ రెడ్డి, ఏఎంసి చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ రుద్రూర్ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్ ఎస్సై సాయన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు.

High yields can be obtained by growing sugarcane crops

More articles

Latest article