25.2 C
Hyderabad

అక్రమంగా అమ్ముతున్న 77 వేల మద్యం బాటిళ్లు స్వాధీనం

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్వాయి, బతుకమ్మ :

గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరైనా వ్యక్తులు మద్యం అక్రమంగా రవాణా చేసిన,విక్రయించిన,కఠినమైన చర్యలు తప్పవని ఇందల్వాయి ఎస్సై సందీప్ తెలిపారు.అందులో భాగంగానే ఇందల్వాయి మండలంలోని వివిధ గ్రామాలలో ఎస్ఐ తన సిబ్బంది తనిఖీలు నిర్వహించగా ఇందల్వాయి మండలంలోని గౌరారం గ్రామంలో గోదా చిన్న సాయిలు అనే వ్యక్తి అక్రమంగా మద్యం అమ్ముతుండగా పట్టుకొని అతను వద్దనుండి మొత్తంగా సుమారు రూ. 77 వేల విలువగల మద్యాన్ని పంచనామా నిర్వహించి స్వాధీన పరచు కోవడం జరిగినదని ఎస్ఐ సందీప్ తెలిపారు. అలాగే గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల్లో ప్రజలు సహకరించాలని కోరారు వాహనాలలో ప్రయాణం చేసేటప్పుడు డబ్బు, నగలు,మద్యం తరలించవద్దని సూచించారు.

More articles

Latest article