నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 60 సెల్ ఫోన్ రికవరి చేసి బాధితులకు అందజేసినట్లు అదనపు పోలీస్ కమిషనర్ (సిఎస్బి) ఎస్.శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ మధ్య కాలంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో సెల్ఫోన్లు పోయిన వారివి రికవరి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ ప్రతీఒక్కరు వారి సెల్ ఫోన్లను వాడడంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల పట్లకూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవ్వరైనా వారి సెల్ఫోన్ పోయినట్లయితే వారు : సీఈఐఆర్ పోర్టల్ ద్వారా అట్టి నెంబర్ను www.ceir.gov.in వెబ్సైటులో వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందపర్చాలి అని, అలా చేసినట్లయితే త్వరగా వారి సెల్ ఫోన్స్ ను రికవరీ చేస్తారని తెలిపారు. ప్రజలు ఈ పద్దతిని సద్వినియోగపర్చుకోవాలని అన్నారు. ప్రజలు ఎవ్వరుకూడా గుర్తు తెలియని వ్యక్తులకు తమ పాత సెల్ఫోన్లను అమ్మవద్దని సెకండ్ హాండ్ సెల్ఫోన్స్ కొన్నట్లయితే వాటి రసీదును తప్పనిసరి తీసుకోవాలని తెలిపారు. ఇందులో కృషిచేసిన మహిళా ఒకటో టౌన్ పీసీ డి. అనుష, ఐటీ సెల్ పీసీ ఆర్.సుష్మా లను పోలీస్ కమీషనర్ అభినందించారు. ఈ కార్యాక్రమంలో ఇంచార్జీ (అడ్మిన్) మస్తాన్ అలీ (ఎ.సి.పి పోలీస్ ట్రెయినింగ్ సెంటర్), ఐ.టి కోర్, ఆర్.ఎస్.ఐ ఎన్.నిషిత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
