27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా నవదుర్గ మాత ఆలయ 5వ వార్షికోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న శ్రీశ్రీశ్రీ నవదుర్గ మాత ఆలయం 5వ వార్షికోత్సవ మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన మహా పూజలు, హోమాలు, అలంకరణలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరైప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించిన వారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆలయ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. జిల్లా అధికారులు,వివిధ శాఖల ఉద్యోగులు, స్థానిక ప్రజలు, మహిళలు, యువతులు పెద్ద ఎత్తున హాజరై దేవీదర్శనం చేసుకున్నారు. భక్తి నమ్మకాలు, ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యత

5th anniversary of Navadurga Mata Temple celebrated in grand style

ప్రతిఫలించిన ఈ వేడుక అత్యంత వైభవంగా సాగింది. ఈ సందర్భంగా చైర్మన్ అలుక కిషన్ మాట్లాడుతూ భక్తుల సహకారంతో ఆలయం ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి సాధించిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామనితెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని భక్తులు, అధికారులు,కమిటీ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకలను ఆలయ కమిటీ చైర్మన్ అలుక కిషన్, కార్యదర్శి సంఘం అమృత్ కుమార్, సహాధ్యక్షులు చిట్టి నారాయణ, ఖజానాదారు సత్యనారాయణ, సభ్యులు ఉమా కిరణ్, సత్యం, గంధం వెంకటేశ్వర్లు,పెద్దోళ్ల నాగరాజు తదితర కమిటీ సభ్యుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.

5th anniversary of Navadurga Mata Temple celebrated in grand style

More articles

Latest article