ఘనంగా నవదుర్గ మాత ఆలయ 5వ వార్షికోత్సవం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న శ్రీశ్రీశ్రీ నవదుర్గ మాత ఆలయం 5వ వార్షికోత్సవ మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన మహా పూజలు, హోమాలు, అలంకరణలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరైప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించిన వారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు....