నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో అప్రమత్తం
వెబ్ న్యూస్, బతుకమ్మ : కాశ్మీర్ లో పహల్గాం దాడి తరహాలో మరిన్ని దాడులు జరగవచ్చని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదుల ఇళ్లు కూర్చివేత తర్వాత జమ్మూ కాశ్మీర్లో స్లీపర్ సేల్స్ యాక్టివేట్ అయినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ప్రణాళిక ప్రకారం కాశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో 87 పర్యాటక ప్రదేశాల్లో 48 పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. స్థానిక ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే భద్రతా బలగాలకు సమాచారం ఇవ్వాలని సూచించాయి. కాశ్మీర్లోని ప్రధాన ప్రదేశాలతో పాటు సున్నితమైన పర్యాటక ప్రదేశాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలు మోహరించాయి.
