28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రజావాణికి 103 ఫిర్యాదులు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 103 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయన్న, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్ లకు  విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సబ్ కలెక్టర్, ఆర్డీఓల నేతృత్వంలో డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత డివిజన్ పరిధిలోని తహసీల్దార్ లు పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

103 complaints to Prajavani

More articles

Latest article