29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మైనర్ ప్రాణాలకు మీదకు తెచ్చిన యువతి ఇన్ స్టా ఐడి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇన్ స్టా ఐడీ అడిగిన  మైనర్ కు బెదిరింపులు

. . .  భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్య                  

పిట్లం, బతుకమ్మ :

ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సు గా పనిచేస్తున్న యువతి ఇన్ స్టా ఐడిని అడగడం మైనర్ ప్రాణాల మీదకు తెచ్చింది. మైనార్టీ తీరని యువకుడిని ఆసుపత్రికి సంబంధించిన వ్యక్తులు బెదిరించడంతో భయంతో అతడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.పిట్లం మండల కేంద్రంలో ఒక మైనర్ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నిజామాబాద్ జిల్లా వర్ని మండలం అంబం గ్రామానికి చెందిన మైనర్ యువకుడి (17) గత కొంతకాలంగా పిట్లం మండల కేంద్రంలో ఒక టిఫిన్ సెంటర్లో పని చేస్తున్నారు. బుధవారం మండల కేంద్రంలో ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ ఐడి ఇవ్వాలని కోరగా ఆమె నిరాకరించింది. దీని విషయమై హాస్పిటల్ సిబ్బంది గురువారం ఉదయం మైనర్ నివసిస్తున్న ఏరియాలో ఉన్న వ్యక్తులను విచారించి అతడిని పిలిచి భయభ్రాంతులకు గురి చేసినట్లు ప్రాథమిక సమాచారం. దీంతో మనస్థాపానికి గురైన మైనర్ యువకుడి నేను కాలకృత్యాలు తీర్చుకుని వస్తానని చెప్పి  అతను ఉంటున్న రూం కు వెళ్లి సీలింగ్ కు స్కిప్పింగ్ వైరుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. దీని విషయమై భాదిత మైనర్ తల్లి కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు పిట్లం ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

More articles

Latest article