మోర్తాడ్ బతుకమ్మ: విద్యార్థులు పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెద్దన్న అన్నారు. విద్యార్థులు విజయాన్ని ఇల్లు నిర్మించినట్లుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నిర్మించుకోవాలని సూచించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు తృతీయ సంవత్సరం విద్యార్థులు స్వాగతం కార్యక్రమం నిర్వహించారు. కళాశాలకు చెందిన విద్యార్థి కాస మధు అర్థశాస్త్రంలో రాష్ట్రస్థాయిలో 35వ ర్యాంకు సాధించడం గర్వకారణమని గుర్తు చేశారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్, విద్య కోర్సులలో మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. కళాశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని, మంచి అనుభవం కలిగిన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మర్రిపల్లి భూపతి, అకాడమిక్ కోఆర్డినేటర్ యు. దశరథ్, సీనియర్ అధ్యాపకులు రాజయ్య, రవీందర్ విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు.
