ఆర్ అండ్ బి అధికారులు కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం..
ఎల్లారెడ్డి, బతుకమ్మ :
గత నెలలో తీవ్రమైన వర్షాలు వరదల వల్ల డామేజ్ అయిన లింగంపల్లి కుర్దు డైవర్షన్ రోడ్డు కం బ్రిడ్జ్ నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ పరిశీలించారు. ఇటివల కాలంలో ఎమ్మెల్యే డైవర్షన్ రోడ్డు కం బ్రిడ్జ్పున: నిర్మాణ పనులకు కోటి రూపాయల నిధులు మంజూరు చేసిన విషయం విదితమే. శనివారం నాడు నియోజకవర్గ పర్యటనలో భాగంగా లింగంపల్లి కుర్దు డైవర్షన్ రోడ్డు కం బ్రిడ్జి పనులను స్థానిక లింగంపేట మండల నాయకులు, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారుల తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ డైవర్షన్ రోడ్ కం బ్రిడ్జ్ పనులలో జరుగుతున్న జాప్యం పై ఆర్ అండ్ బి శాఖ ఇంజనీర్లు, కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనులను సత్వరమే పూర్తిచేసి ఆర్ అండ్ బి అధికారులను ఎమ్మెల్యే మధన్మోహన్ ఆదేశించారు.ః

