నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ గా డాక్టర్ టి యాదగిరిరావు నియమితులయ్యారు. రాష్ర్ట ప్రభుత్వం తొమ్మిది యూనివర్సిటీలకు వీసీలను శుక్రవారం నియమించింది. కాకతీయ విశ్వవిద్యాలయం పబ్లిక్ అడ్మినిస్ర్టేషన్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గా పని చేసిన యాదగిరిరావును టీయూ వీసీ నియమించారు. హన్మకొండకు చెందిన యాదగిరిరావు కాకతీయ యూనివర్సిటీ లో యూజీసీ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ గా, సోషల్ సైన్సెస్ కు డీన్ గా, బోర్డ్ ఆఫీస్ స్టడీస్ కు చైర్మన్ గా, రాష్ర్ట ప్రభుత్వం ఉత్తమ అధ్యాపకుడిగా 2021లో అవార్డు పొందారు. రవీందర్ గుప్తా ఏసీబీకి చిక్కిన తరువాత ఐఏఎస్ అధికారులే ఇన్చార్జి వీసీలుగా పని చేశారు.
