29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ మోర్తాడ్ : మోర్తాడ్ మండల కేంద్రంలో గురువారం బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై BRS పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు రుణమాఫీ అందరికి చేస్తనన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొద్ధి మందికే చేసి మిగతా వారికి మొండి చెయ్యి చూపి మోసం చేస్తున్నారని ఆరోపించారు. దరఖాస్తుల పేరిట అధికారుల చుట్టూ తిప్పుకొని కాలయాపన చేస్తూన్నారని అన్నారు.2 ల క్షల రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకు షరతులు లేకుండా పూర్తిగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. .దరఖాస్తుల పేరిట ఆలస్యం చేస్తే ఊరుకునేది లేదని మరింత ఉద్యమ రూపంలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కార్యక్రమంలో అన్ని గ్రామాల BRS పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు రైతు నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article