రుద్రూర్, బతుకమ్మ : హోలీ పండుగను పురస్కరించుకొని రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో శుక్రవారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలలో వివిధ ప్రాంతాల నుండి మల్లాయోధులు వచ్చి కుస్తీ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలో గెలిచిన వారికి నగదు బహుమతిని ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్ల సురేష్, మాజీ జెడ్పిటిసి నారోజి గంగారం, సురేందర్, కే. సాయిలు, సంతోష్ పటేల్, కే. స్వామి, పాపయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
