27.5 C
Hyderabad
Friday, July 31, 2026

పువ్వులను పూజించడం తెలంగాణ గొప్ప సాంస్కృతి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్

 

నిజామాబాద్, బతుకమ్మ : పువ్వులను పూజించడం మన తెలంగాణ గొప్ప సాంస్కృతి అని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. కన్నుల పండుగగా అంగారంగ వైభవంగా నిజామాబాద్ జిల్లా పోలీసు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నగనరంలోని విజయలక్ష్మి  గార్డెన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు మాట్లాడుతూ పోలీసు వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆడడం ఇంత మంది

Worshipping flowers is a great culture of Telangana

కుటుంబ సభ్యులను కలిసినందుకు వారితో బతుకమ్మ సంబరాల్లో పాల్గొనందుకు ఆనందంగా ఉందని తెలియజేశారు. తెలంగాణ సాంస్కృతికి చారిత్రక చిహ్నం బతుకమ్మని తెలంగాణ సాంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు బతుకమ్మ , విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి (అడ్మిన్) జి.బస్వా రెడ్డి , అదనపు డిసిపి (ఏఆర్)  రామచంద్రరావు, నిజామాబాద్, ఆర్మూర్,  బోధన్ ఏసీపీ లు రాజా వెంకటరెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

Worshipping flowers is a great culture of Telangana

More articles

Latest article