బిక్కనూర్, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలోని కేజేఎల్ పౌల్ట్రీ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు శుక్రవారం కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని, కార్మిక చట్టాల ప్రకారం దక్కాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు.గత రెండేళ్లుగా యాజమాన్యం తమకు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని కార్మికులు ఆరోపించారు. నెలవారీ జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతి నెలా 12 తేదీలోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయి ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేసి తమ ఇబ్బందులను తొలగించాలని కోరారు.సంస్థలో ఏళ్ల తరబడి పనిచేస్తున్నప్పటికీ తమకు ఇప్పటివరకు కార్మిక గుర్తింపు కార్డులు, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించలేదని కార్మికులు ఆరోపించారు. కార్మిక చట్టాల ప్రకారం తమకు దక్కాల్సిన హక్కులు, సౌకర్యాలను కల్పించాలని యాజమాన్యాన్ని కోరారు. వేతనాల చెల్లింపుతో పాటు ప్రయోజనాలు చట్టబద్ధమైన అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బకాయి వేతనాలను వెంటనే చెల్లించి, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించి తమకు న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు విధుల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. యాజమాన్యం స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
