కేజేఎల్ పౌల్ట్రీ గేటు ఎదుట కార్మికుల బైఠాయింపు
బిక్కనూర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలోని కేజేఎల్ పౌల్ట్రీ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు శుక్రవారం కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని, కార్మిక చట్టాల ప్రకారం దక్కాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు.గత రెండేళ్లుగా యాజమాన్యం తమకు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని కార్మికులు ఆరోపించారు. నెలవారీ జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతి నెలా 12 తేదీలోపు వేతనాలు...