25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎంపిడిఓ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కోటగిరి : కోటగిరి గ్రామపంచాయతీ కార్మికుల రెండు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని గురువారం కోటగిరి ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ చందర్ తో చర్చలు జరిగాయని, నాలుగు రోజుల్లో వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు  సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వం, అధికారులు చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. బకాయి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పాలు చేయడం మంచిది కాదన్నారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో నిధులు లేకపోవడంఏంటని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, డిపిఓ, డిఎల్ పిఓ జిల్లా ఉన్నతాధికారులు గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించడంపై దృష్టి సారించాలని కోరారు. లేకపోతే గ్రామపంచాయతీ కార్మికులతో కలిసి పంచాయతీ కార్యాలయం ఎదుట పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు శేఖర్, పోశెట్టి, లింగవ్వ, బ్రహ్మం, సాయవ్వ, లక్ష్మి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article