ఎంపిడిఓ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా

బతుకమ్మ, కోటగిరి : కోటగిరి గ్రామపంచాయతీ కార్మికుల రెండు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని గురువారం కోటగిరి ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ చందర్ తో చర్చలు జరిగాయని, నాలుగు రోజుల్లో వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు  సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వం, అధికారులు చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. బకాయి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పాలు చేయడం...