23.7 C
Hyderabad

మంచి నీటి కోసం మహిళల రాస్తారోకో

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ : తాము ఎదుర్కొంటున్న తాగునీటి కష్టాలను తీర్చాలంటూ మండలంలోని కొత్తబాది గ్రామానికి చెందిన మహిళలు సోమవారం రాస్తారోకో చేశారు. ఖాళీ బిందెలు, బకెట్లతో రోడ్డుపై బైటాయించారు. గ్రామంలో కొంతకాలంగా మంచినీరు సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని సముదాయించారు.

More articles

Latest article