30.9 C
Hyderabad
Monday, August 3, 2026

మహిళలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

వేల్పూర్, బతుకమ్మ :

 

పిటిషన్ శిక్షణ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ప్రాజెక్టు మేనేజర్ భరత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో సోమవారం బ్యూటిషన్ (బ్యూటీ పార్లర్) శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షణ 15 రోజుల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు బోధించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. శిక్షణ తీసుకునే మహిళలకు మధ్యాహ్నం భోజన సదుపాయం ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమం ప్రారంభించి మొదటి రోజు కార్యక్రమానికి హాజరైన మహిళలకు బ్యాగులు నోటి పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ నిర్వాహకులు ముత్తెన్న, సంతోషి, ఐకెపి సీసీలు లక్ష్మీ, సునీత తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article