25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఏకరూప దుస్తులను మహిళా సంఘాల సభ్యులు కుట్టడంతో వచ్చే డబ్బుల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని నిజామాబాద్ జిల్లా సిసి ల అధ్యక్షుడు తడకల శ్రీనివాస్ అన్నారు. మోర్తాడ్ మండలంలోని దొనకల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏకరూప దుస్తులు కొట్టడం ద్వారా సంఘాల్లోని సభ్యులకు కొంతవరకు పని లభిస్తుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మధుసూదన్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article