28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జీహెచ్ఎంసీలో బీజేపీ ఎందుకు ఒక్కఎమ్మెల్యే సీటు గెలవలేదు

Must read

📰 Generate e-Paper Clip

. దీనికి జిమ్మేదార్ ఎవరు..? పార్టీ ఆలోచించాలి

. విలేకరుల సమావేశంలో ఎంపీ అర్వింద్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 48 డివిజన్లు గెలుచుకున్న బీజేపీ ఒక్క ఎమ్మెల్యే సీటును ఎందుకు గెలుచుకోలేకపోయిందనేదానిపై పార్టీయే ఆలోచించుకోవాల్సి ఉందని, దీనికి జిమ్మేదార్ ఎవరని ఎంపీ అర్వింద్ అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో రైల్వే ఓవర్ బ్రిడ్జీలపై మంగళవారం రివ్వూయ నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన వారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయడం లేదన్నారు. ప్రజలు బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ పార్టీ ఎందుకు అధికారంలోకి రావడం లేదో ఆలోచించే పనిలో పార్టీ ఉండాలని సూచించారు. అధికారంలోకి రావాల్సిన బీజేపీ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమతమైందన్నారు. రాష్ర్టంలో ఏం జరుగుతోందని, మొన్న విగ్రహాలను ధ్వంసం ఘటనలో ఏం జరిగిందని ప్రశ్నించారు. 

More articles

Latest article