26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పేదోడి సొంత ఇంటి కల నెరవేరుతున్న వేళ

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్,బతుకమ్మ: పేదోడి సొంతింటి కల నెరవేరడంతో పాటు సొంత ఇంటిలో  ఉండబోతున్నాం అన్న సంతోషంతో లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారని పంచాయతీ కార్యదర్శి సంతోష్ అన్నారు. మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో సోమవారం  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు ముగ్గులు పోసి భూమి పూజ చేయడం జరిగినదని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపడం జరిగింది. కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సింగారం లక్ష్మి, అంగడి మమత, మునీరుద్దీన్, మోహన్, మల్లూరి బాబురావు, కారోబార్ అబ్బుల శీను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article