28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అదుపుతప్పి గోధుమ లారీ బోల్తా

Must read

📰 Generate e-Paper Clip

  • అతివేగమే కారణమా..?

 

బతుకమ్మ, భిక్కనూరు: గోధుమ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన భిక్కనూరు మండలం సిద్ధరామేశ్వరనగర్ స్టేజి వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ప్రొద్దున మధ్యప్రదేశ్ నుండి హైదరాబాద్ వెళ్తున్న గోధుమ లారీ 44 జాతీయ రహదారిపై బోల్తా పడింది.ఈ ప్రమాదానికి  డ్రైవర్ అతివేగమే కారణమని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న డ్రైవర్లు మాత్రం ఆ జాగ్రత్తగా అతివేగంగా నడుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Wheat lorry overturns after losing control

More articles

Latest article