25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో శనివారం వాహనదారులకు రుద్రూర్ ఎస్సై సాయన్న రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ ద్విచక్ర వాహనం పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలన్నారు. హెల్మెట్ ధరించడం వలన ప్రమాదాలకు గురైనప్పుడు ప్రాణాలు కాపాడుకోవచ్చని సూచించారు. అదేవిధంగా వాహనదారులు సీట్ బెల్టు పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న ద్విచక్ర వాహనదారులకు ఎస్సై సాయన్న అభినందిస్తూ శాలువాతో సన్మానించారు.

More articles

Latest article