తెయూ వీసీ టి.యాదగిరిరావు
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో హాస్టల్లలోని అపరిస్కృత సమస్యలను పరిష్కరిస్తామని తెలంగాణ యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ టి.యాదగిరిరావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యూ, ఓల్డ్ బాయ్స్ హాస్టల్ ను సోమవారం వైస్ ఛాన్స్ల ప్రొఫెసర్ టి యాదగిరిరావు, రిజిస్టార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ మెస్ కమిటీ తో పాటుగా విద్యార్థులను హాస్టల్లో ఉన్నటువంటి మౌలిక సమస్యను అడిగి తెలుసుకున్నారు. 24/7 వైఫై ని తక్షణమే అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. పాక్షికంగా మిగిలిన కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రికల్ పనులను అతి త్వరలో పూర్తి చేయిస్తామని విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది. విద్యార్థుల వినతి మేరకు హాస్టల్ రెన్యువల్ డిపాజిట్ లను 3000 నుండి 2000 తగ్గిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఈ ఆకస్మిక తనిఖీలో ఇంజనీర్ వినోద్, చీప్ గార్డెన్ డాక్టర్ మహేందర్ రెడ్డి, వార్డెన్లు ,కేర్ టేకర్లు తదితరులు పాల్గొన్నారు.

