25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తాం

Must read

📰 Generate e-Paper Clip

  • మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్

 

బతుకమ్మ,మోర్తాడ్: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. గ్రామాలలో జరుగుతున్న గ్రామసభల కార్యక్రమాల్లో భాగంగా మోర్తాడ్ మండలం కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మండల మోహన్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు పథకాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. జాబితాలో పేరు రాణి వారు అధైర్య పడవలసిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి, ఎమ్మార్వో సత్యనారాయణ, ఏపీవో శకుంతల, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

We will provide government schemes to all those who are eligible

More articles

Latest article