- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేశామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో బుధవారం లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయి అన్నారు. పేదలకు సహాయంగా అండగా ఉంటూ నియోజకవర్గ ప్రజల మంచి మాత్రమే కోరుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు అర్హులకు అందిస్తామని తెలిపారు. రుణమాఫీ చేసి చూపించాం.. రైతు భరోసా అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి దక్కుతుందన్నారు.

