27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

బోధన్ లో నెలరోజులు నీటి సరఫరాలో అంతరాయం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : బోధన్: రాకసిపేట్‌లో ఉన్న 12.22 ఎంఎల్డీ సామర్థ్యపు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో ఫిల్టర్ మీడియా మార్పు పనులు చేపట్టడం వల్ల, బోధన్ పట్టణంలోని పలు ప్రాంతాలకు దాదాపు ఒక నెలపాటు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు అధికారులు తెలిపారు. ఫిల్టర్ యూనిట్ల ఆధునీకరణ, శుద్ధి సామర్థ్యాన్ని మెరుగుపర్చే చర్యల్లో భాగంగా ఈ పనులు జరుగుతున్నాయి. పనులు పూర్తయ్యే వరకు నీటి పంపిణీ సాధారణంగా ఉండకపోవచ్చని, అందువల్ల ప్రజలు ముందస్తుగా తగినంత నీటిని నిల్వ చేసుకుని తమ అవసరాలను ప్లాన్ చేసుకోవాలని మున్సిపల్ అధికారులు సూచించారు. అధికారులు ప్రజలను సహకరించాలని, పనిచేసే కాలంలో తాత్కాలిక ఇబ్బందులు ఎదురైనా పనులు ముగిశాక నీటి నాణ్యత మెరుగుపడుతుందని తెలిపారు.

More articles

Latest article