బతుకమ్మ, జుక్కల్ : కౌలాస్ నాలా ప్రాజెక్టులో 387 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ తెలిపారు. ఒక గేటు విడుదల చేసి 287 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 458 మీటర్లు ఉండగా ప్రస్తుతం 457.95 మీటర్లు ఉందని ఆయన అయినా పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి వరద నీరు వస్తున్నాయని ప్రాజెక్టులో చేరుతున్నాయని ఆయన అన్నారు.
